ఆర్ కె పురం డివిజన్ లో ఆగి పొయిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కమిషనర్ కు రాసిన లేఖను డివిజన్ నేతలతో కలిసి కమిషనర్ కు ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంజూరు అయిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆయన కోరారు. అదే విధంగా ఆర్ కె పురం సమగ్రాభివృద్ధికి నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కమిషనర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చిన వారిలో అరవింద్ శర్మ తో పాటు డివిజన్ సీనియర్ నాయకులు రామాచారి న్యాలకొండ శ్రీనివాస్ రెడ్డి గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్ కంచెర్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.









