ప్రభుత్వ ప్రాథమిక బాలుర అందుల పాఠశాల దారుల్ షిఫా లో యాన్వల్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మందడి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ అంద విద్యార్థులు ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను వినియోగించుకొని చక్కగా చదువుకోవాలని విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలని కోరారు. ఇ ఎం ఎ ఫౌండేషన్ సభ్యులైన మహేష్ ఈశ్వర్ విద్యార్థులకు ఐపాడ్లు అందించి వాటిని చక్కగా వినియోగించుకోవాలని కోరారు. ఈ ఐపాడ్ లు విద్యార్థులకు అనేక రకాలుగా ఉపయోగపడతాయని ఫౌండేషన్ సభ్యులు చెప్పారు . ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అంజాద్ ఖాన్ ,రవికాంత్, రవీందర్ రెడ్డి, జానయ్య, మలిహ తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.
Post Views: 5









