- మద్యం మానండి కుటుంబాన్ని కాపాడండి
- మీ నిర్ణయం మీ జీవితాన్ని మార్చుతుంది
- నవోదయ సిద్దార్థ
ఖేడ్ ఏప్రిల్ 15( జర్నలిస్ట్ షైక్ ఫయాజ్ )
మద్యం బానిసత్వం జీవితం నాశనం చేసే నిశ్శబ్ద శత్రువు అని మద్యం మానండి కుటుంబాన్ని కాపాడండి అని ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ డైరెక్టర్ నవోదయ సిద్దార్థ అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఇటీవల కాలంలో మద్యం సేవనం అలవాటుగా మారి, అది క్రమంగా బానిసత్వంగా మారుతోంది. ఒకప్పుడు వినోదంగా ప్రారంభమైనది ఇప్పుడు కుటుంబాలను, ఆరోగ్యాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తున్న మహా సమస్యగా మారింది. బానిసత్వం ఎలా మొదలవుతుంది అంటే స్నేహితుల ఒత్తిడి, ఒత్తిడి నుంచి రిలీఫ్ కోసం, ఆనందం కోసం మొదలైన మద్యం అలవాటు కొంతకాలానికి నియంత్రణ కోల్పోయే స్థాయికి చేరుతుంది. కొంచెం మాత్రమే అన్నది లేకుండా ఉండలేనుగా మారిపోతుంది. మద్యం బానిసత్వం వల్ల కుటుంబాల్లో కలహాలు పెరుగుతున్నాయి.
భార్య, పిల్లలపై మానసిక మరియు శారీరక వేధింపులు,
కుటుంబ ఆర్థిక పరిస్థితి దెబ్బతినడం, పిల్లల భవిష్యత్తు చీకట్లోకి వెళ్లడం ఒక వ్యక్తి అలవాటు మొత్తం కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టేస్తోందన్నారు. మద్యం ఎక్కువగా సేవించడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. కాలేయం (లివర్) దెబ్బతినడం, గుండె సంబంధిత వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు పెరుగుతున్నాయి. మద్యం తాత్కాలిక ఆనందం ఇస్తుంది కానీ శాశ్వత నష్టాన్ని మిగులుస్తుందని అన్నారు. సమాజంపై ప్రభావం
రోడ్డు ప్రమాదాలు పెరగడం
నేరాలు అధికమవడం
యువత భవిష్యత్తు ప్రమాదంలో పడడం, మద్యం బానిసత్వం వ్యక్తిగత సమస్య మాత్రమే కాకుండ అది సామాజిక సమస్యగా మారుతోంది. దీనితో బయటపడటం సాధ్యమే,
కుటుంబ సభ్యుల మద్దతు అత్యవసరం, వైద్యుల సహాయం తీసుకోవాలి, డీ-అడిక్షన్ సెంటర్లను సంప్రదించాలి, సానుకూల ఆలోచనలు, ఆరోగ్యకరమైన అలవాట్లు అలవరుచుకోవాలి, మద్యం సమస్యలకు పరిష్కారం కాదని అది సమస్యలకే మూలంమన్నారు. అందుకోసం ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ మద్యానికి వ్యతిరికంగా పోరాటం చేస్తామని, బెల్టుషాపుల ప్రోటాహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందుకోసం ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం, ప్రతి యువకుడు మద్యం బానిసత్వం నుండి దూరంగా ఉండాలని, సమాజాన్ని ఆరోగ్యంగా, సురక్షితంగా మార్చడం మన అందరి బాధ్యతని పిలుపునిచ్చారు.









