హనుమకొండలో ఘోర ప్రమాదం: లారీ ఢీకొని వివాహిత మృతి, భర్తకు తీవ్ర గాయాలు

అనగా తేదీ: 14.4.2026 సాయంత్రం సుమారు ఐదున్నర గంటలకు హనుమకొండ, తిమ్మాపూర్ హవేలీ, మార్కండేయ నగర్ కు చెందిన జట్టి విజయలక్ష్మి ఆమె భర్త జట్టి సదానందం లు హెచ్ఎఫ్ డీలక్స్ TG 24 B 3247 బైక్ పై దేశాయ్ పేట వైపు వెళ్తూ ఉండగా, వారి బైక్ వెనకాలే అతి వేగంగా, అజాగ్రత్తగా వచ్చిన కర్ణాటకకు చెందిన లారీ డ్రైవర్ సూర్య వంశీ ప్రకాశం, తండ్రి పేరు: తుకారం; లారీని KA 56 3968 అతి వేగంగా అజాగ్రత్తగా నడుపుతూ వచ్చి బైకు వెనుక వైపు టక్కరి ఇవ్వగా బైక్ పై ఉన్న జట్టి విజయలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా ఆమె భర్త సదానందం కు బలమైన గాయాలు తగిలి ప్రస్తుతం ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇట్టి విషయంలో మృతురాలి యొక్క అన్న దోమ మల్లేష్, తండ్రి పేరు: సారయ్య గారు ఇచ్చిన దరఖాస్తు పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు