జిఎంఆర్ బృందావన్ లో వైభవంగా
అంబేద్కర్ జయంతి.
————————
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను హనుమకొండ వడ్డేపల్లిలోని జిఎంఆర్ బృందావన్ అపార్ట్మెంట్లో మంగళవారం వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు దయాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది, “అసాధారణ ప్రతిభాశాన్ని అంబేద్కర్” పుస్తక రచయిత ఎ.జయశంకర్, ప్రముఖ సామాజికవేత్త పగడాల సరళ, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అనురాధ, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి .స్వర్ణకుమార్, కోశాధికారి డి.నవీన్ కుమార్ సహాయ కోశాధికారికి ప్రకాష్ పాల్గొని ప్రసంగించారు. నివాసితులకు అంబేద్కర్ జీవితం పై క్విజ్, డ్రాయింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. చివరగా విజేతలకు బహుమతి ప్రధానం చేశారు.
Post Views: 17









