,సంగారెడ్డి ప్రతినిధి
భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మంగళవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సామాజిక న్యాయం, సమానత్వం, హక్కుల పరిరక్షణ కోసం చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. భారత రాజ్యాంగ రూపకర్తగా దేశ నిర్మాణంలో ఆయన చేసిన అపార సేవలను మంత్రి స్మరించుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి అమలు చేస్తోందని, సమాన అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, విద్యా,ఉపాధి అవకాశాలు అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితోనే కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. యువత అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో సమాజ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.









