మల్కాజిగిరిలో మంగళవారం పార్టీలకతీతంగా బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భారతదేశ చరిత్రలో గొప్ప నాయకుడిగా నిలిచారన్నారు. ఆయన కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదని, సమానత్వం, న్యాయం, మానవ జాతి కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు అని పలువురు వక్తలు కొనియాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్. రామ చంద్ర రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, దళిత సంఘాల నేతలు, మాజీ కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్, క్యానం రాజ్య లక్ష్మి, పాల్గొన్నారు. ఈ సందర్బంగా నేతలు కేకు కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.
Post Views: 12









