సంగారెడ్డి జిల్లా
సదాశివపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన వెంకటేశ్వర షాపింగ్ మాల్ ను మాజీ మంత్రి హరీష్ రావు, హీరోయిన్ నిధి అగర్వాల్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించడం జరిగింది. వెంకటేశ్వర షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు,ఎమ్మెల్యే లు చింతా ప్రభాకర్, మాణిక్ రావు, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, హీరోయిన్ నిధి అగర్వాల్ జ్యోతి ప్రజ్వల చేసి సందడి చేశారు. హీరోయిన్ నిధి అగర్వాల్ నీ చూడడానికి పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలు తాండోప తండాలుగా శ్రీ వెంకటేశ్వర షాపింగ్ మాల్ వద్దకు చేరుకొని హీరోయిన్ నిధి అగర్వాల్ చేసిన సందడిని ప్రజలు చూసి కేరింతలు పెట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న సదాశివపేట పట్టణంలో నూతనంగా షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ వెంకటేశ్వర షాపింగ్ మాల్ 5వ బ్రాంచ్ ను సదాశివపేటలో ఏర్పాటు చేయడం చాలా సుభ సూచకమని, ఈ అవకాశాన్ని సదాశివపేట పట్టణ ప్రజలు, చుట్టుపక్క ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు, బట్టలు ఇక్కడ లభిస్తాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర షాపింగ్ మాల్ కుటుంబ సభ్యులు నీల వెంకటేశం బ్రదర్స్, స్థానిక ప్రజా ప్రతినిధులు,నాయకులు పాల్గొన్నారు.









