అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ మోర్చా నాయకురాలికి ఆర్థిక సహాయం
వరంగల్ జిల్లా 14వ డివిజన్ మహిళ మోర్చా నాయకురాలు శ్రీమతి పిట్ట సరస్వతి తీవ్ర కిడ్నీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న డాక్టర్ వన్నాల వెంకట రమణ వారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
వాక్ ఫౌండేషన్ ద్వారా ఆమెకు ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంగా డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ, వాక్ సమైక్య ఫౌండేషన్ ద్వారా గత 16 సంవత్సరాలుగా పేదలకు బియ్యం పంపిణీ, వైద్య శిబిరాలు, విద్యా సహాయం వంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బన్న ప్రభాకర్, ఎరుకల రఘునారెడ్డి, మాదాసు రాజు, దామెర సదానందం, దండు చక్రపాణి తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Post Views: 15









