చిట్యాల మండలంలో ‘అరైవ్ అలైవ్ (సురక్ష)’ సదస్సు: రోడ్డు భద్రతపై గ్రామస్థులకు ఎస్‌ఐ సతీష్ అవగాహన

రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు – చిట్యాల మండలం
తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “Arrive Alive (సురక్ష)” కార్యక్రమంలో భాగంగా చిట్యాల మండలం లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
చిట్యాల ఎస్‌ఐ పోచంపల్లి సతీష్ ఆధ్వర్యంలో చిట్యాల, చల్లగరిగ, జడల్‌పేట, ఒడితల గ్రామాల్లో ఈ కార్యక్రమం జరిగింది. గ్రామాల్లో రోడ్డు సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేసి వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు.
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని, అతివేగం ప్రమాదాలకు దారితీస్తుందని ఎస్‌ఐ సతీష్ వివరించారు.
అలాగే ప్రమాదాల్లో గాయపడిన వారికి సహాయం చేసే రహీ వీర్ పథకం గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు