ఘనంగా ప్రారంభమైన ‘ఏ.బి.ఆర్ జన వందనం’ ప్రత్యేక సంచిక
గీసుకొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ‘ఏ.బి.ఆర్ జన వందనం’ ప్రత్యేక సంచికను గీసుకొండ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్, రాంపూర్ సర్పంచ్ రడం భరత్, జిల్లా నాయకులు అల్లం మర్రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అల్లం స్వప్న బాలకిషోర్ రెడ్డి చేపడుతున్న సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. ‘ఏ.బి.ఆర్ జన వందనం’ ప్రత్యేక సంచిక ద్వారా ఈ సేవలను ప్రతి ఇంటికి చేరవేయడం గొప్ప ముందడుగు అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మనుగొండ సర్పంచ్ పేర్ల శ్రవణ్, సూర్య తండా సర్పంచ్ బానోతు రాఘవేంద్ర, దశ్రు తండా సర్పంచ్ కేలోతు అమృత బిక్షపతి, మాజీ సొసైటీ చైర్మన్ రడం శ్రీధర్, మాజీ సర్పంచులు డోల్ చిన్ని, గోనె మల్లారెడ్డి, కెలోత్ స్వామి, సునీల్, రాజేష్, స్వామి, రాంబాబు, వికాస్, ఉదయ్, సాయిలి మధు, నాగార్జున, రాజు, హార్జ్య తండా హరి నాయక్, లాల్ సింగ్, మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు..









