సోషల్ మీడియాలో ఎవరు ట్రెండ్ అవుతారో ఊహించలేరు. కొంతమంది సినీ తారలు అతి తక్కువ సమయంలోనే ఫేమస్ అవుతారు. అలాంటి వారిలో మఠారీ ముద్దుగుమ్మ గిరిజా ఓక్ కూడా ఒకరు. గత రెండు వారాలుగా ఆమె ఫొటోలు, వీడియోలు, ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూ ద్వారా ఆమె చెప్పిన షాకింగ్ కామెంట్స్ అందరిని ఆశ్చర్యపరిచాయి.
ఇంటివ్యూ లో యాంకర్ అడిగిన ప్రశ్న – తెలియని వ్యక్తితో రొమాన్స్ చేయడానికి ఎలా ప్రిపేర్ అవుతారు? ముఖ్యంగా కిస్సింగ్ షాట్లు ఎలా షూట్ చేస్తారు? – పై ఆమె వివరించింది. షూటింగ్ సమయంలో మొత్తం ప్రక్రియ మెకానికల్గా జరుగుతుందని, నిజమైన భావాలను చూపించాల్సిన అవసరం లేదని తెలిపింది. సౌండ్ ఇబ్బంది పెట్టరాదు అనడంతో ఏసీలు ఆఫ్ చేసి సీన్ షూట్ చేస్తారు.
ఇంటిమేట్ సీన్స్ సమయంలో చుట్టుపక్కల సిబ్బంది ఎలా ఉండతారో, హెయిర్స్టైలిస్టులు హెయిర్ సెట్ చేస్తారో, లైటింగ్ కోసం థర్మాకోల్ ఉపయోగిస్తారో వంటి వివరాలు ఆమె వివరించింది. సీన్స్ చేస్తున్నప్పుడు చెమటలు కారుతూనే ఉంటాయని, కాబట్టి ఈ ప్రక్రియలో ఎవరో ఒకరు చెమట తుడుస్తారని చెప్పింది.
కీర్తి గిరిజా వెల్లడించిన మరో ముఖ్య విషయం – ఒక్కో సీన్ వాస్తవ ప్రేమను చూపించదు. కొన్నిసార్లు నటుడు కంటే కార్డ్బోర్డ్ను ముద్దు పెట్టినట్టే అనిపిస్తుంది. క్లోజప్ తీసేటప్పుడు కూడా నిజమైన ఫీలింగ్ రావడం కష్టం. థర్మాకోల్ లేదా బ్లాక్ క్లాత్ పక్కన ఉంచి రొమాంటిక్ డైలాగులు చెప్పడం షూటింగ్ లో భాగమని చెప్పింది. ఇలా ఆమె ఫ్లిమ్ ఇంటిమేట్ సీన్స్ వెనుక సీక్రెట్లు బయటపెట్టింది.









