సహజ పంటలే భవిష్యత్‌ – కొండా విశ్వేశ్వర్ రెడ్డి

Chevella MP Konda Vishweshwar Reddy urges farmers to adopt natural farming practices during national pulses mission event at NARM.

వ్యవసాయం పర్యావరణ వ్యవస్థకు హాని కలిగించకుండా సహజ పంటలను పండించడంలో ఉత్తమ పద్ధతులను అవలంబించాలని చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా **పప్పు ధాన్యాలపై జాతీయ మిషన్ “ధన్ ధాన్య కృషి యోజన”**ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం దేశవ్యాప్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని రాజేంద్రనగర్‌లోని నార్మ్‌లోని ఎం.ఎస్. స్వామినాథన్ ఆడిటోరియంలో శాస్త్రవేత్తలు, అధికారులు, రైతులు, విద్యార్థులు వీక్షించారు.

ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని ప్రజలకు సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయరంగానికి ప్రభుత్వం నిరంతరం బాసటగా నిలుస్తోందని, రైతుల అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నార్మ్ ఇన్‌చార్జ్ డైరెక్టర్ డాక్టర్ వి. రామసుబ్రమణ్యం, డాక్టర్ రమేష్ నాయక్, రైతులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share