హైదరాబాద్ ట్రాఫిక్ అవగాహనలో భాగంగా యాంటీ కరప్షన్ ఫౌండేషన్ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో నాగోల్ అల్కాపురి చౌరస్తాలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ బెల్ట్, హెల్మెట్, రాంగ్ రూట్ వంటి అంశాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అన్యాయం జరిగిన యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ద్వారా బాధితులకు అండగా నిలుస్తామన్నారు. లంచాలు లేని రాష్ట్రంగా తమ వంతు బాధ్యతగా యాంటీ కరప్షన్ ఫౌండేషన్ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చీఫ్ డైరెక్టర్ కే. కళ్యాణి, రంగారెడ్డి డిస్టిక్ చీఫ్ డైరెక్టర్ సుధాకర్, ప్రెసిడెంట్ కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ శర్మ, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Post Views: 7









