లోక కళ్యాణార్థం ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం..

విద్యా శంకర భారతి స్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పాల్గొన్నారు

హైదరాబాద్:శ్రీ విద్యా శక్తి పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ నారాయణ చక్రవర్తి శర్మ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ అలివేలుమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం కర్మన్‌ఘాట్‌లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానం నుండి విద్యా శంకర భారతి స్వామివారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పాల్గొన్నారు.

భక్తుల నడుమ ఆధ్యాత్మిక వాతావరణంలో కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది.

కళ్యాణ కార్యక్రమం అనంతరం విద్యా శంకర భారతి స్వామివారు భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. లోక కళ్యాణం కోసం ఇంత అంగరంగ వైభవంగా కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని పేర్కొన్నారు. ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమాల ద్వారా భగవత్ శక్తి, సనాతన ధర్మం యొక్క గొప్పతనం ప్రజలకు తెలియజేయవచ్చని అన్నారు. ధర్మం మనిషి ఎలా జీవించాలి, సమాజం ఎలా ఉండాలి అనే విషయాలను తెలియజేసే గొప్ప సంప్రదాయమని స్వామివారు వివరించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ విద్యా శక్తి పీఠం ట్రస్ట్ సభ్యులు సుధాకర్ శర్మ, నిరంజన్ దేశాయి, రవీందర్‌రావు, శైలజ, శిరీష, శ్రీలేఖ, నాగరత్న, విజయదుర్గ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు