శివనగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి నివేదిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం జిల్లా కలెక్టర్ సత్య శారద అధ్యక్షతన శివనగర్ సాయి కన్వెన్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి జిల్లా అధికారులు ప్రజలకు వివరించారు అలాగే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ సంబంధించిన లబ్ధిదారులకు చెక్కులు అందించారు, ఇందిరమ్మ మహిళా శక్తి సంబంధించి మైనార్టీలకు కుట్టు మిషన్లు మరియు ఇందిరమ్మ చీరలు లబ్ధిదారులకు అందించడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను మరియు సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందించడంలో ప్రజా ప్రభుత్వం ముందుందని అన్ని రంగాలలో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు మరింత అందుబాటులో మరిన్ని పథకాలు అందించేందుకు కృషి చేస్తుందని అన్నారు రాబోయే కాలంలో మరిన్ని నూతన పథకాలు పేదలకు చేరువ చేసే క్రమంలో ప్రజలందరూ ప్రజా ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాలని కోరారు అనంతరం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా అధికారులు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజ్ మీసాల ప్రకాష్ కొత్తపల్లి శ్రీనివాస్ స్థానిక కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ కార్పొరేటర్లు పల్లం పద్మరవి, ముష్కమల అరుణసుధాకర్, భోగి సువర్ణ సురేష్ భైరవ ఉమా దామోదర్ యాదవ్ పోషాల పద్మ స్వామి మర్పల్లి రవి, దిడ్డి కుమార్ స్వామి, వాస్కుల బాబు గుండు చందన పూర్ణచందర్, బాలి సురేష్, కావేటి కవిత, పోని స్వర్ణలత భాస్కర్, చింతాకుల అనిల్ లతోపాటు అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.









