ఈనెల 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజెపి ఆధ్వర్యం లో జనాగ్రహ సభ..

*ఈనెల 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజెపి ఆధ్వర్యం లో జనాగ్రహ సభ*

బడంగ్ పేట్ సర్కిల్:
ఈనెల 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజెపి ఆధ్వర్యం లో నిర్వహించనున్న జనాగ్రహ సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్న సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలి అని బీజెపి రాష్ట్ర కో-ఆపరేటివ్ సెల్ కన్వీనర్ కోలన్ శంకర్ రెడ్డి తెలిపారు.బడంగ్ పేట్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోలన్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ…….తెలంగాణ ప్రజలకు ఎనిమిది వేల కోట్ల రూపాయల తో ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి చేసిన కార్యక్రమాలు ప్రారంభించనున్నారని కోలన్ శంకర్ రెడ్డి తెలిపారు.తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఇస్తుందని శంకర్ రెడ్డి తెలిపారు.కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదని అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మరని తెలిపారు.కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు మహిళా బిల్లును అడ్డుకొని మహిళలకు అన్యాయం చేశారని మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేశారని ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు