వట్టిశేఖర్,పుట్టినరోజుసందర్భంగాఎమ్మెల్యేలశుభాకాంక్షలు..

నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కోతులారం గ్రామానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వట్టికోటి శేఖర్ జన్మదిన వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. ప్రజాసేవలో నిరంతరం ముందుంటూ, ఆపదలో ఉన్న వారికి ‘అన్నా’ అని పిలవగానే అండగా నిలిచే గొప్ప మనసున్న వ్యక్తిగా శేఖర్ ఈ ప్రాంతంలో గుర్తింపుపొందారు.ఫోన్ ద్వారా వట్టికోటి శేఖర్ పుట్టినరోజు సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆయనకు ఫోన్ చేసి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గ అభివృద్ధిలో, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలుఅభినందించారు.సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. శేఖర్ గారి సేవా గుణాన్నికొనియాడుతూ పలువురుపోస్టులుచేశారు.జన్మదినానికి ముందే ఆయన నివాసంలో కుటుంబ సభ్యులు, ఆప్తమిత్రులు, బంధువుల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. శేఖర్ గారు నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని అభిమానులు ఆకాంక్షించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు