*పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలి*
*సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు*
TG5, సంగారెడ్డి ప్రతిని ధి
కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై పెంచిన ధరలను తగ్గించాలని సిపిఎం సంగారెడ్డి జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. నేడు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఇప్పటికే పెరిగిన ధరలతో పేద మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడ్తున్నారు. ములిగే నక్క పై తాటికాయ పడ్డట్టు
భారత్‌లో గ్యాస్ ధరలు ఒక్కసారిగా 993రూపాయలు పెంచిందని విమర్శించారు. ఒక్క సరిగా ధరలు భగ్గుమన్నాయన్నారు.హోటళ్లు, ఇతర వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రం అమాంతం పెంచేయటం దారుణమని అన్నారు.ఒక్కో వాణిజ్య సిలిండర్‌పై పెంచిన రూ.993 వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. 5 రాష్ట్రాలలో ఎన్నికలు ముగియగానే మోడీ భారాలు వేస్తున్నారని విమర్శించారు.దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలనీ పిలుపు ఇచ్చారు.









