వరంగల్ జిల్లా ఆదర్శ గ్రామమైన గంగదేవిపల్లి లో బస్‌స్టాండ్ వద్ద గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చల్లివేంద్రం ప్రారంభించబడింది. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కూసం స్వరూప–రమేష్ గారు చేతుల మీదుగా ప్రారంభించారు.
ఎండాకాలంలో ప్రయాణికులు, గ్రామ ప్రజలకు *తాగునీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ చల్లివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది*. దీనివల్ల బస్‌స్టాండ్ వద్దకు వచ్చే వారికి ఉపశమనం కలుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మేడిద ప్రశాంత్ గారు, వార్డ్ సభ్యులు పెండ్లి కొమురెల్లి, గోనె రామ, గూడ మంజుల, సల్ల రాజకుమార్, గ్రామ మంచినీటి కమిటీ అధ్యక్షులు గోనె నాగరాజు, మాజీ అధ్యక్షులు పెండ్లి మల్లారెడ్డి, గ్రామ పెద్దలు గూడ సంపత్, ఎరుకల రమేష్, మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Post Views: 21









