హైదరాబాద్:
గత ఎనిమిది సంవత్సరాలుగా హస్తినపురం,జెడ్పి రోడ్డు సర్వే నెంబర్ 58/1 లో వెయ్యి గజాల ప్లాట్ ను మూడు విభాగాలుగా విభజించి 300 గజాల ప్లాట్లు లో సర్వీసింగ్ సెంటర్, వెదురు కర్రల షాపును ఏర్పాటు చేసుకొని కవిత, కృష్ణవేణి జీవనోపాధి పొందుతున్నారు.
అకస్మాత్తుగా ఈరోజు ఎల్బీనగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ విభాగము అధికారులు వచ్చి సర్వీసింగ్ సెంటర్, వెదురు కర్రల షాపును ను కూల్చి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
సర్వే నెంబర్ 60 లో అనుమతులు లేని నిర్మాణాలు జరుగుతున్న అధికారులు చూసి చూడనట్టేవారిస్తున్నారని కేవలం బడుగు,బలహీన వర్గాలు చెందిన తమ పై అధికారులు ప్రతాపం చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సర్వే నెంబర్ 60 లో అనుమతులు లేని నిర్మాణాలు జరుగుతున్నాయని నోటీసులో ఉన్న అధికారులు మాత్రం 58 లో కూల్చి వేయడం ఏమిటని బాధ్యతలు ప్రశ్నించారు.
జిహెచ్ఎంసి అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తమ జీవనోపాధిని కోల్పోయామని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
సర్వ నెంబర్ 58 లో తమ ప్లాట్ పక్కన ఉన్న స్థలాలకు నిర్మాణం చేసుకోవడానికి అనుమతించిన జిహెచ్ఎంసి అధికారులు తమకు మాత్రం ఇవ్వడంలేదని బాధితులు ఆరోపించారు.









