ఈ నెల 22 నుండి మే నెల 12 వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఆరు (బాలుర),ఐదు (బాలికల) జూనియర్ కళాశాలలు ఉన్నాయి. మొత్తం సొసైటీ పరిధిలో 290 కళాశాలలో 24,740 సీట్లు ఉన్నాయి. ఎంపీసీ, బైపిసి, ఎంఈసి, సిఈసి,హెచ్ఈసి రెగ్యులర్ గ్రూపులతో పాటు అగ్రికల్చర్ అండ్ క్రాఫ్ ప్రొడక్షన్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, ఫ్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఎం పి హెచ్ డబ్ల్యు), మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ అనే 7 వృత్తి విద్యా కోర్సులు సొసైటీ పరిధిలో ఉన్న కళాశాలల్లో అందుబాటులో ఉన్నాయి. పదో తరగతి మార్కులు ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. విద్యార్థులు https://mjptbcwreis.telangana.gov.in లేదా https://mjp tbc admission.org/MJP Inter వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి .బీసీ గురుకులాల్లో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయనవసరం లేదని తమ స్కూల్ ప్రిన్సిపాల్ కు దరఖాస్తు ఇస్తే సరిపోతుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా RCO బి రాజేష్ మరియు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా DCO యం. శంకర్ బాబు ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు 040 23328266 నంబర్ కు సంప్రదించాలని సూచించారు.









