మైనారిటీ విద్యార్థులకు టీజీఎంఆర్‌ఈఐఎస్‌లోనే నాణ్యమైన విద్య: న్యాయవాది మొహీద్ పటేల్

నారాయణఖేడ్, ఏప్రిల్ 20:(tg5 న్యూస్)( జర్నలిస్ట్ షైక్ ఫయాజ్ )
మైనారిటీ విద్యార్థులకు తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ (టీజీఎంఆర్‌ఈఐఎస్) పాఠశాలలు, కళాశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని నారాయణఖేడ్ ఎంఐఎం అధ్యక్షుడు, న్యాయవాది మొహీద్ పటేల్ అన్నారు.
సోమవారం నారాయణఖేడ్‌లోని టీజీఎంఆర్‌ఈఐఎస్ బాలుర శాఖ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మొహీద్ పటేల్‌ను కలిసి టీజీఎంఆర్‌ఈఐఎస్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్య వ్యక్తి అభివృద్ధికి, సమాజ పురోగతికి కీలకమని పేర్కొన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మైనారిటీ విద్యార్థులు 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, అలాగే ఇంటర్మీడియట్ కోర్సుల్లో టీజీఎంఆర్‌ఈఐఎస్ పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాలు పొందాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విద్య, వసతి, ఇతర సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను టీజీఎంఆర్‌ఈఐఎస్‌లో చేర్పించాలని ఆయన కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు