- హైదరాబాద్ పాతబస్తీ కంచన్బాగ్ పోలీసుల సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా గుట్టురట్టు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, పది మొబైల్ ఫోన్లు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ నెల 15న డీఎంఆర్ఎల్ చౌరస్తా వద్ద ఓ వృద్ధుడి దగ్గర నుంచి మొబైల్ ఫోన్ను దొంగిలించిన కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఆధారంగా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరు పలు కేసుల్లో నేరచరిత్ర ఉన్న పాత నేరస్థులుగా పోలీసులు తెలిపారు.
నిందితులు ముందుగా లక్ష్యంగా వ్యక్తులను గుర్తించి, ఒకరు ఫోన్ లాక్కుంటే, మరొకరు గమనిస్తూ సహకరించే విధంగా ప్లాన్ చేసేవారని పోలీసులు వెల్లడించారు.
ఇంకా పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. అరెస్టు చేసిన వారిని రిమాండ్కు తరలించారు.
Post Views: 21









