మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి ప్రతాపసింగారంలో ఘరానా దొంగల గ్యాంగ్ అరెస్ట్

 

మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాపసింగారంలో ఘరానా దొంగల గ్యాంగ్‌ను ఫ్యూచర్ సిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తేజశ్రీ హోమ్స్, మంజు శ్రీ మిడోస్ కాలనీలలో అద్దెకు ఉంటున్నారనే పక్కా సమాచారంతో శనివారం రాత్రి చేవెళ్ల పోలీసుల బృందం వారి నివాసాలపై ఆకస్మిక దాడులు నిర్వహించింది.

ఈ దాడుల్లో సుమారు 70 మొబైల్ ఫోన్లు, భారీ మొత్తంలో బంగారం, ఒక కారు, బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు గత కొద్ది రోజులుగా కుటుంబాలతో కలిసి ప్రతాపసింగారంలో నివసిస్తూ, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చేవెళ్ల ప్రాంతాల్లో ఫోన్ దోపిడీలు, చైన్ స్నాచింగ్‌లు, ఇతర దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది.

పోలీసులు దాడి చేయగానే కొంతమంది నిందితులు పారిపోగా, మహిళా నిందితులను(పారిపోయిన నిందితుల సతీమణిలు) అదుపులోకి తీసుకున్నారు.

ఈ గ్యాంగ్‌కు చెందిన వారు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిగా ప్రాథమిక సమాచారం లభించింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు