*ఉప్పల్ లోని నాచారం ఎక్సైజ్ పిఎస్*
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాచారం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధి మల్లాపూర్ పారిశ్రామిక ప్రాంతంలో గంజాయి విక్రయాలు జరుపుతున్న ధారావత్ సంతోష్, సందీప్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన నాచారం ఎక్సైజ్ పోలీసులు.
వారి నుండి కిలో రెండు వందల పొడి గంజాయి, ఒక హోండా యాక్టివా బైక్, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్ కి తరలింపు.
నిందితులు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ ప్రాంతం నుండి ఎండు గంజాయిని చౌక ధరలకు కొనుగోలు చేసి, అవసరమైనవారికి అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
విద్యార్దులు, పారిశ్రామిక ప్రాంతంలో పనిచేసే ఉద్యోగులే లక్ష్యంగా అమ్మకాలు చేపడుతున్నారు అనే సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు రూట్ వాచ్ చేసి నిందితులను పట్టుకున్నారు.
ఉప్పల్ లోని నాచారం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో ప్రెస్ నోట్ విడుదల చేసి, నిందితులను రిమాండ్ కి తరలించారు.









