తమిళనాడు ఎన్నికల బందోబస్తుకు వెళ్లే హోమ్ గార్డులకు కిట్ల పంపిణీ: క్రమశిక్షణతో విధులు నిర్వహించి జిల్లాకు మంచి పేరు తీసుకురండి – సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్

• తమిళనాడు సాదారణ ఎన్నికల బందోబస్తు విధులకు హాజరౌతున్న హోమ్ గార్డ్ సిబ్బందికి మెడికల్ మరియు కనీస అవసరాల కిట్లు పంపిణీ.
• విధుల్లో ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి, సంగారెడ్డి జిల్లా కు మంచి పేరు తీసురావాలి : జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపిఎస్.

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తమిళనాడు రాష్ట్రంలో జరుగనున్న సాదారణ ఎన్నికల నేపథ్యంలో బందోబస్తు విధులకు సంగారెడ్డి జిల్లా నుండి వెళుతున్న 38 మంది హోమ్ గార్డ్ సిబ్బందికి జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ మెడికల్ మరియు కనీస అవసరాల కిట్లను అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఎన్నికల విధులు అత్యంత బాధ్యతాయుతమైనవని, సిబ్బంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు. దూర ప్రాంతాలలో విధులు నిర్వహించేందు వెళుతున్న సిబ్బంది బాగోగులను దృష్టిలో ఉంచుకొని, అవసరమైన ప్రాథమిక ఔషధాలు, బిస్కెట్స్, వ్యక్తిగత అవసరాల సామగ్రి అందుబాటులో ఉండేలా ఈ కిట్లు అందజేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అలాగే విధుల్లో అప్రమత్తంగా ఉండి, ఎలాంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, సంగారెడ్డి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలున్న నేరుగా సంగారెడ్డి జిల్లా పోలీసు డ్యూటి డాక్టర్ కు కాల్ చేసి, మెడిసిన్స్ వివరాలను తెలుకోవచ్చు అన్నారు. విధి నిర్వహణలో లేదా వ్యక్తిగత సమస్యలున్నా సంబంధిత అధికారుల ద్వారా నా దృష్టికి తీసుకురాలవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎ.ఆర్ డిఎస్పీ నరేందర్, పోలీసు డ్యూటి డాక్టర్ జ్యోతి, డానియెల్ ఆర్ఐ హోమ్ గార్డ్స్, ఆర్ఐ లు సురేష్ నాయక్, రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రావ్, బందోబస్తు విధులకు వెళుతున్న ఆర్.ఎస్ఐ అశోక్, సిబ్బంది పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు