ఆందోల్ లో మంత్రి దామోదర్ రాజనర్సింహ సుడిగాలి పర్యటన.

T G 5, సంగారెడ్డి ప్రతినిధి

• జోగిపేట పాలిటెక్నిక్ కాలేజీలో సుమారు 75 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

శనివారం ఆందోల్ నియోజకవర్గం లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన లో బాగంగా చౌటకూర్ మండలం శివంపేట్,జోగిపేట పాలిటెక్నిక్ కళాశాలలో న్యూలాండ్ ఫౌండేషన్ సీఎస్ఆర్ రూ.43 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన మెకానికల్ వర్క్‌షాప్ షెడ్‌ను మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. పాలిటెక్నిక్ కాలేజీలో డి ఎం ఎఫ్.టి 6లక్షల రూపాయలతో ఏర్పాటుచేసిన హిమస్ట్ ఎల్. ఈ.డి 4 స్ట్రీట్ లైట్లను ప్రారంభించారు. అనంతరం 26 లక్షల రూపాయలతో తోషిబా కంపెనీ సి ఎస్ ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…జోగిపేట పాలిటెక్నిక్ కాలేజీ కి ఇప్పటివరకు 2 కోట్ల 35 లక్షల 75 వేల రూపాయల సీఎస్ఆర్ నిధులను వెచ్చించి పలు అభివృద్ధి పనులను చేపట్టమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య , వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ అభివృద్ధిపై కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం లో పాల్గొన్నారు. పాలిటెక్నిక్ కాలేజీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. పాలిటెక్నిక్ కాలేజీలో గర్ల్స్ హాస్టల్ నిర్మాణానికి, ఇతర విభాగాల వర్క్ షెడ్ల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, అదనపు కలెక్టర్ పాండు, సర్పంచ్ సంధ్యారాణి, న్యూ ల్యాండ్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ డివి రెడ్డి, ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు