సంగారెడ్డి జిల్లాలో ఘనంగా “అరైవ్ అలైవ్” కార్యక్రమం: రోడ్డు భద్రతే కుటుంబానికి రక్షణ అన్న ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్

• ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు
• రక్తదాన శిబిరాలు, హెల్మెట్ పంపిణీ, సీపీఆర్ మరియు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమాలు
• ట్రాఫిక్ నియమాలు మన కుటుంబానికి రక్షణ: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్

TG 5,సంగారెడ్డి ప్రతినిధి:

“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఆరవ రోజు (ఏప్రిల్ 18) సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలను నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, రోడ్డు భద్రత నియమాలు పాటించినప్పుడే మనతో పాటు మన కుటుంబం సురక్షితంగా ఉంటుందని అన్నారు. వాహనాలు నడిపేటప్పుడు పూర్తి ఏకాగ్రతతో ఉండాలని సూచించారు. డిఫెన్సివ్ డ్రైవింగ్ గురించి వివరిస్తూ, డ్రైవర్ ముందుగా తన వాహనం పరిస్థితి గురించి తెలుసుకుని ఉండాలని, వాహనాన్ని ఎంత వేగంగా నడపడం కాకుండా ఆ వేగాన్ని నియంత్రించగలగడం ముఖ్యమని అన్నారు. అజాగ్రత్తగా వాహనం నడపడం ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.

ఆరవ రోజు కార్యక్రమాలలో భాగంగా నారాయణఖేడ్ సబ్-డివిజన్ పోలీసులు లయన్స్ క్లబ్ సహకారంతో నారాయణఖేడ్ పట్టణ పోలీసు స్టేషన్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించి 100 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న ప్రాణాలను కాపాడవచ్చని, ప్రజలు ముందుకు రావాలని కోరారు.

సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్ ఆధ్వర్యంలో బుదేరా గ్రామంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాహనదారులకు 150 హెల్మెట్లు పంపిణీ చేసి, హెల్మెట్ ధరించడం మరియు ట్రాఫిక్ నియమాలను పాటించడం పై అవగాహన కల్పించారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు.

జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో సీపీఆర్‌పై ప్రజలకు మరియు సిబ్బందికి అవగాహన కల్పించి, ట్రాఫిక్ నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు