శాసనమండలి ఉపసభాపతి డాక్టర్ బండ ప్రకాష్
తన కడుపునింతా బాధలున్న ప్రపంచానికి హాస్యాన్ని అందించి ఆనందపరిచిన అద్భుత కళాకారుడు చార్లీ చాప్లిన్ అని శాసనమండలి ఉపసభాపతి డాక్టర్ బండ ప్రకాష్ అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో రోజా క్రియేషన్స్ డైరెక్టర్ ఆలేటి శ్యాంసుందర్ ఆధ్వర్యంలో జరిగిన చార్లీ చాప్లిన్ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత రెండు దశాబ్దాలుగా క్రమం తప్పకుండా చాప్లిన్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్న రోజా క్రియేషన్స్ ను ఆయన అభినం దించారు. ఈసారి ఓరుగల్లు కళలోకాన్ని హైదరాబాద్ కు రప్పించి కార్యక్రమాలు నిర్వ హించడం ఎంతైనా అభినంద నీయం అన్నారు. వరంగల్ నుంచి తన కళా ప్రస్థానాన్ని ప్రారంభించిన ప్రముఖ మిమిక్రీ కళాకారుడు సినీ నటుడు శివారెడ్డికి గౌరవ డాక్టరేట్ తన వంతుగా కృషి చేస్తాన న్నారు.
ప్రముఖ నటుడు శివారెడ్డి మాట్లాడుతూ తన మూడు దశాబ్దాల కళా ప్రస్థానంలో ఓరుగల్లు మైలు రాయి అయిందన్నారు. మరో ప్రముఖ బుల్లితెర ఫేమ్ ఆర్ఎస్ నంద ఈ కార్యక్రమంలో మాట్లా చుతూ తాను కరీంనగర్ జిల్లా లో పుట్టిన ఓరుగల్లు కళాకారుల అభినందనలు అందు కోవడం ఎంతో స్ఫూర్తి నిస్తుంద న్నారు.
రోజా క్రియేషన్స్
నవ్వుల చక్రవర్తి
బుల్లితెర సెలబ్రిటీ జంట టాకింగ్ డాల్ రాకేష్ జబర్దస్త్ పేమ్ సుజాత, మైములో ప్రపంచ ప్రఖ్యాత కళాకారులు కళాధర్, మైమ్ మధు. వరంగల్ నుంచి సినీ పరిశ్రమలో నిర్మాత దర్శకునిగా ఎదిగిన భీమ గాని సుధాకర్ గౌడ్, జలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి, జాతీయ మేజీషియన్ కళ్యాణ్, అంతడుపుల నాగ రాజు, తదితర అనేకమంది ప్రముఖులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
రోజా క్రియేషన్స్ పక్షాన జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ నాయకుడు గట్టు మహేష్ బాబుకు ఈ సంద ర్భంగా చాప్లిన్ కళా రత్న అవార్డును ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు. ప్రముఖ రచయిత చిటవరం శ్రీమన్నారాయణ,బహుముఖ ప్రజ్ఞశాలి రచయిత డైరెక్టర్ ముదిగొండ శ్రీనివాస్ హంసలేఖ మధు, తయ్యాల శ్రీధర్ ఆచార్య, తిరునగరి పరేందర్, ప్రముఖ యాంకర్ హిమశ్రీ, పులి గణేష్, తదితర అనేకమంది ఓరుగల్లు కళాకారులు. వేడుకల్లో పాల్గొ న్నారు. రవీంద్ర భారతి వేదికగా చార్లీ చాప్లిన్ వేడుకలు నిర్వహించిన శ్యామును కళాకారులు అభినందించారు.









