ట్రాఫిక్ నిబంధనలు పాటించండి – సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోండి…

కాజీపేట ట్రాఫిక్ పోలీసులు “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా సుబేదారి అదాలత్ సెంటర్ వద్ద వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు యమధర్మరాజు, చిత్రగుప్తుడి వేషధారణలో ఉన్న కానిస్టేబుళ్లు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ ధరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, ఇన్‌స్పెక్టర్ వెంకన్నతో పాటు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు