నిన్న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా బిల్లుకు కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలు వ్యతిరేకించడంతో బిల్ పాస్ కాకపోవడానికి వ్యతిరేకిస్తూ నేడు బిజెపి కొంపల్లి అధ్యక్షులు సతీష్ సాగర్ ఆధ్వర్యంలో, జిల్లా ఉపాధ్యక్షులు రాజిరెడ్డి మరియు రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు సరిత రావు గారు ముఖ్య అతిథులుగా నేడు కొంపల్లిలోనే అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాచ్, నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలకు కూటమికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వతులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహిళలకు రాజ్యాధికారంలో చట్టబద్ధత కల్పించే విధంగా పెట్టిన ఈ బిల్లుకు కాంగ్రెస్ మితపక్షాలు వ్యతిరేకించడం మహిళలపై వారికి ఉన్న అక్కసును తెలుపుతుంది. గత అనేక దఫాలుగా కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఈ బిల్లు పెట్టే ఆలోచన చేయలేదు, ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో వారు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటింగ్ వేయడం హేయమైన చర్య. నిన్న పార్లమెంట్లో జరిగిన తీరుని యావత్ భారత మహిళా లోకం మొత్తం వ్యతిరేకిస్తుంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరియు దాని మిగతా పక్షాలను భూస్థాపితం చేసే విధంగా మహిళలోకం కంకణం కట్టుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు జనార్దన్ రెడ్డి, బిజెపి జిల్లా నాయకులు శివాజీ రాజు, శంకర్ నాయక్, అశోక్, కొంపల్లి నాయకులు నరసింహ, చక్రధర్, శ్రీనివాస్, నర్సింగ్ రావు, సందీప్, శివ కుమార్, మహేందర్ సాగర్, తిరుపతి, దుర్గ, పెద్దబుద్ధుల ఆశ, లతా మహేశ్వరి, సూర్యకల, మాధురి, శోభారెడ్డి, శుశీల, నాగమణి, సీతదేవి, లక్ష్మి, వేదదేవి, సౌమ్య, సంజన, గీత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.









