తెలంగాణ రాష్ట్ర రెండవ పిఆర్సి ని శివశంకర్ కమిటీ నుండి తెప్పించుకొని 51శాతం ఫిట్మెంట్ తో వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన చేశారు. టీఎన్జీవో అధ్యక్షుడు మారం జగదీష్ , ముజీబ్ ల పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ ఉద్యోగుల ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ను వెంటనే అమలు చేయాలని, 13 వేల కోట్ల పైచిలుకు ఉన్న ఉద్యోగుల, పెన్షనర్ల పెండింగ్ బిల్లును ఏక మొత్తంలో ఒకేసారి విడుదల చేయాలని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్స్ స్కీమ్ ను రద్దుచేసి ఓల్డ్ పెన్షన్ స్కీమును అమలు చేయాలని అన్నారు. ప్రభుత్వం ముందుంచిన 63 డిమాండ్ ను వెంటనే పరిష్కరించాలని కోరారు.
Post Views: 8









