జాబితాలో తప్పులు లేకుండా చూడాలి

బి యల్ ఓ శిక్షణలో సబ్ కలెక్టర్ ఉమాహారతి
నారాయణఖేడ్,ఏప్రిల్ 17 (tg5 న్యూస్ )( జర్నలిస్ట్ షైక్ ఫయాజ్ ):

జనగణన సందర్బంగా బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ తిరిగి ఓటరు జాబితాను తప్పులు లేకుండా, సమగ్రంగా పరిశీలించాలని నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఎన్. ఉమాహారతి అన్నారు. శుక్రవారం ఖేడ్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బూత్ స్థాయి అధికారుల శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ..ఒకే ఇంటిలో నివసించే కుటుంబ సభ్యుల పేర్లు ఓటారు జాబితాలో వేర్వేరు చోట కాకుండా ఒకే చోట ఉండేలా చూడడం జనగణన ముఖ్య ఉద్దేశం అన్నారు.ఇంటింటి సర్వేకు వెళ్ళినప్పుడు మరణించిన వారి పేర్లను తొలగించడం,కొత్త ఓటర్లను చేర్చడం చేయాలి అన్నారు.కుటుంబ సభ్యులందరినీ ఒకే చోట గ్రూప్ చేసి మ్యాపింగ్ చేయాలి అన్నారు.2026 నాటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐ ఆర్ ) కు సంబంధించి మ్యాపింగ్, ఎనుమేరేషన్ మరియు అన్నెక్సుర్ తప్పకుండ నమోదు చేయాలి అన్నారు.మ్యాపింగ్ పూర్తయిన ఓటర్ల వివరాలను సేకరించడానికి అనెక్జర్ ను ఉపయోగించాలి అన్నారు.ఓటరు జాబితాలోని వివరాలు మరియు క్షేత్రస్థాయిలో ఉన్న ఓటర్ల వివరాలు సరిపోలితే వారిని అన్నెక్సుర్ 3 లో నమోదు చేయాలి అన్నారు.నెల రోజుల పాటు అత్యంత కీలకంగా ఇంటింటి తనిఖీ కార్యక్రమం నిర్వహించాలి అన్నారు.అనెక్జర్ 4 ఇది మ్యాపింగ్ కాని ఓటర్ల కోసం కేటాయించబడిందని,ఓటరు జాబితాలో పేరు ఉండి, క్షేత్రస్థాయిలో వారు మ్యాపింగ్ కాకపోతే (ఉదాహరణకు: ఇల్లు మారినవారు లేదా అందుబాటులో లేనివారు) వారి వివరాలను అన్నెక్సుర్ 4 ద్వారా సేకరించాలి అన్నారు.కొత్తగా ఓటరుగా నమోదు కావాల్సిన వారు లేదా అర్హత ఉండి జాబితాలో లేని వారి కోసం కూడా అన్నెక్సుర్ ను ఉపయోగించాలి అన్నారు.పకడ్బoదిగా, పక్కాగా,ఎటువంటి పొరపాట్లు లేకుండా నెల రోజుల పాటు కార్యక్రమం కొనసాగించాలి అన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హసీనా బేగం,నాయబ్ తహసీల్దార్ రాజు పాటిల్,గిర్ధావర్ మాధవరెడ్డి,శిక్షకులు భూమయ్య,నర్సింలు, బిఎల్ఓ లు,ఆయా పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు