వరంగల్: వరంగల్ నగరంలోని లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ సమీపంలో గంజాయి మత్తులో ఉన్న ముగ్గురు వ్యక్తులు హమాలిపై దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. మార్కెట్లో పనిచేస్తున్న హమాలి సూరయ్యపై దుండగులు అకస్మాత్తుగా దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆయనను ఎంజీఎం ఆసుపత్రి కి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Post Views: 18









