ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలి…. టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి

అర్హులైన ప్రతి లబ్ధిదారుకు సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు…. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
రిపోర్టర్: ఉల్లిగడ్డల శివకుమార్, సంగారెడ్డి ప్రతినిధి

సంగారెడ్డి, జిల్లాలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం కంది మండలంలోని రైతు వేదికలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు.

కార్యక్రమం ప్రారంభంలో రాష్ట్ర గీతాన్ని ఆలపించి, ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. అనంతరం వివిధ శాఖల అధికారులు తమ పరిధిలో అమలవుతున్న సంక్షేమ పథకాల అమలు తీరును వివరించారు.

ఈ సందర్భంగా రైతు రుణమాఫీ, రైతు బీమా, ఇందిరమ్మ ఇళ్లు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, కొత్త రేషన్ కార్డులు, పాస్‌బుక్కులు, సన్నబియ్యం పంపిణీ, వైద్య సేవలు తదితర పథకాల లబ్ధిదారుల వివరాలను ప్రజలకు తెలియజేశారు. అలాగే ముఖ్యమంత్రి అల్పాహారం పథకం, ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం విస్తరణ వంటి నూతన పథకాలపై అవగాహన కల్పించారు.

కొందరు లబ్ధిదారులు తమకు అందిన ప్రయోజనాలను వెల్లడిస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా,
టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు