వరంగల్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం: ఏసీపీ, సీఐ, ఎస్సైల వేధింపులే కారణమంటూ సూసైడ్ నోట్ కలకలం

వరంగల్..

వరంగల్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం.. పోలీసుల తీరుపై తీవ్ర ఆరోపణలు చేసిన బాధితురాలు.

మామునూరు ఏసీపీ, ఎనుమాముల సీఐ, ఎస్సై, మార్కెట్ చైర్మన్‌లే తన చావుకు కారణమంటూ సూసైడ్ నోట్.

12 రోజులుగా తన భర్తను కస్టడీలో ఉంచుకుని కనీసం ఆచూకీ కూడా చెప్పడం లేదని మాధవి ఆవేదన.

అసలు తన భర్త ప్రాణాలతో ఉన్నాడో లేదో తెలియని స్థితిలో మానసిక క్షోభకు గురైనట్లు లేఖలో వెల్లడి.

మార్కెట్ వ్యాపారుల ఒత్తిడితో సంబంధం లేని తన కూతురిపై కూడా తప్పుడు కేసులు పెట్టారని ఆరోపణ.

కనీసం భర్తను కలవనీయకుండా, మాట్లాడనీయకుండా పోలీసులు తీవ్రంగా వేధిస్తున్నారని బాధితురాలి కన్నీరు.

పోలీసుల టార్చర్ భరించలేకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖలో స్పష్టం చేసిన దేశాయిపేట వాసి.

బాధితురాలి వాంగ్మూలం, ఆమె స్వయంగా రాసిన లేఖ ఆధారంగా వరంగల్ నగరంలో వెలుగుచూసిన సంచలన ఘటన.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు