తాండూర్లో బాలల రహదారి భద్రతా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలి
* చిన్నారులు భద్రతే లక్ష్యంగా రోడ్డు సేఫ్టీ ర్యాలీ నిర్వహణ
తాండూర్, ఏప్రిల్ 15
: ఎంఈఓ ఆదేశాల మేరకు ప్రైవేట్ పాఠశాలలు ఈరోజు (15/04/2026)ను బాలల రహదారి భద్రతా దినోత్సవంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా తాండూర్లోని అభ్యాస్ స్కూల్ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది,పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈసందర్బంగా అభ్యాస్ స్కూల్ ప్రిన్సిపాల్ కవిత మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలు పాటించాలి, హెల్మెట్ ధరించాలి, రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి వంటి నినాదాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు.
పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా సాగిన ఈ ర్యాలీకి స్థానిక ప్రజలు మంచి స్పందన ఇచ్చారు. బాలల భద్రత కోసం రహదారి నియమాలను కచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, నిర్వాహకులు సూచించారు.









