అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శప్రాయుడు మన అంబేద్కరుడు
కత్తెరపల్లి దామోదర్ కేయూ జేఏసీ చైర్మన్
ఈరోజు మహానగర పాలక సంస్థ వరంగల్ 17వ డివిజన్ పరిధి గాడేపల్లిలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమాన్ని స్థానిక యువజన సంఘం వారు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఉద్యమ నేత కేయూ జేఏసీ చైర్మన్ కత్తెరపల్లి దామోదర్, పుష్పాలంకరణ చేసిన
అనంతరం దామోదర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు నిరుపేద కుటుంబంలో జన్మించి కటిక దరిద్రాన్ని అనుభవించిన తను గొప్ప మేధాశక్తితో యావత్తు భారత దేశానికి కావలసిన రాజ్యాంగాన్ని రచించడంలో కీలక పాత్ర పోషించిన
మహా మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు అని కొనియాడడం జరిగింది.
బడుగు బలహీన వర్గాలుగా మనందరం ఆయన ఆశయాన్ని సాధించడంలో ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు కడిదల రాజు, జాతీయ అవార్డు గ్రహీత పసునూరి భాస్కర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బట్ట మేకల భరత్, శ్రవణ్ కుమార్, భరత్, బిఆర్ఎస్ నాయకులు పసునూరి సూరయ్య, వంశీ ప్రశాంత్ రింకు,గోపి బన్నీ,పండు ఇతరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అనంతరం పండ్ల పంపిణీ కూడా చేయడం జరిగింది









