హనుమకొండ ఐడీఓసీలో ప్రత్యేక యోగా శిబిరం: పాల్గొన్న జిల్లా కలెక్టర్

హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు “99 రోజుల కార్యాచరణ ప్రణాళిక – ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా ప్రత్యేక యోగా శిబిరం నిర్వహించారు.
IDOC హనుమకొండ ప్రాంగణంలో సోమవారం ఉదయం 6:30 గంటలకు జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. యోగాగురు రామచంద్రోజు రవీంద్ర చారి ఆధ్వర్యంలో యోగా సాధన నిర్వహించారు.
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ స్వయంగా రామచంద్రోజు రవీంద్ర చారి గురువుతో కలిసి యోగా సాధన చేశారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, శారీరక-మానసిక శ్రేయస్సు పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.
జిల్లా అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు