**హైదరాబాద్:**
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, సామాజిక కార్యకర్త మరియు బి.బి.ఆర్ ట్రస్ట్ చైర్మన్ **బి.బి.ఆర్ వేణు** గారు ఈరోజు రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు **ఆర్. కృష్ణయ్య** గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలను, సమాజ సేవలో అనుసరించాల్సిన మార్గాలను వారు చర్చించారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆర్. కృష్ణయ్య గారిని కలవడం సంతోషంగా ఉందని, వారి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తామని బి.బి.ఆర్ వేణు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Post Views: 7









