వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు: నివాళులర్పించిన ఐఎన్టీయూసీ (INTUC) మరియు కాంగ్రెస్ నాయకులు

ఏప్రిల్ 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అవరణలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
జీడబ్ల్యూ INTUC 452 యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు వాగు మరి సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ భైరవైన గట్టయ్య, నాయకులు ఉపేందర్, సారంగపాణి పాల్గొన్నారు.
అలాగే స్థానిక సీనియర్ కాంగ్రెస్ నాయకులు వై భాస్కర్, గోవిందు నాగరాజు, పుల్ల వీరమని, కడారి అశోక్, పత్రి సాంబయ్య, రవి తదితరులు పాల్గొని అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు