వరంగల్..
మిల్స్ కాలనీ పరిధిలో సంచలనమైన సురేష్ కిడ్నాప్, దాడి కేసు
కేవలం 24 గంటల్లోనే యువకుడి కిడ్నాప్, హత్యాయత్నం కేసును ఛేదించిన మిల్స్ కాలనీ పోలీసులు.
మంత్రాలు చేసి కూతుర్ని చంపాడనే అనుమానంతో.. ఐదు వేల రూపాయల సుపారీతో సురేష్ పై దాడికి కుట్ర పన్నిన రాయిలమ్మ.
కిరాణం షాపు వద్ద యువకుడిని బలవంతంగా బైక్ ఎక్కించి.. కోటిలింగాల గుడి సమీపంలో బండరాయితో దారుణ దాడి.
బండరాయితో కొడుతూ, కాళ్లతో తన్నుతూ.. ఆ దాడిని సెల్ ఫోన్ లో వీడియో చిత్రీకరించి పైశాచికానందం పొందిన నిందితులు.
దాడిలో స్పృహ కోల్పోయిన యువకుడు చనిపోయాడని భావించి.. ఆటోలో తీసుకొచ్చి వాళ్ల ఇంటి గల్లీలోనే పడేసి పరారైన వైనం.
ప్రధాన నిందితులు కళ్యాణ్, రాయిలమ్మలకు నేర చరిత్ర.. గతంలో ఏనుమాముల, గీసుగొండ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదు.
ఐదుగురు నిందితుల అరెస్ట్, దాడికి వాడిన ఆటో, మొబైల్ ఫోన్లు స్వాధీనం..
పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం ముమ్మర గాలింపు.









