వరంగల్‌లో ట్రాఫిక్ కష్టాలు: షాపింగ్ మాల్స్ వద్ద రోడ్లనే పార్కింగ్ స్థలాలుగా మార్చడంతో వాహనదారుల అవస్థలు

వరంగల్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకూ తీవ్రంగా మారుతున్నాయి. నగరంలోని ట్రాఫిక్ షాపింగ్ మాల్ వద్ద వాహనదారులు సగం రోడ్డును ఆక్రమించి పార్కింగ్ చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
అక్కడికి వచ్చే వాహనాలు రోడ్డు పక్కన కాకుండా మధ్య వరకు నిలిపివేయడంతో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా రద్దీ సమయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ సమస్యపై స్థానికులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుని రోడ్డుపై పార్కింగ్‌ను నియంత్రించాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు