ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి వివరాలు వెల్లడించిన సికింద్రాబాద్ జోన్ డిసిపి రక్షిత కృష్ణమూర్తి
తాళాలు వేసిన ఇంటిని టార్గెట్ చేసే దొంగను అరెస్ట్ చేసారు
రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తూ తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగ ను అరెస్ట్ చేసిన నల్లకుంట పోలీసులు.
ఈనెల 4వ తేదీన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసిన అజయ్ మహావీర్ బుక్తర్.
నల్లకుంట ప్రధాన రహదారి రైల్వే ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్తూ తాళం వేసి ఉన్న ఇల్లును టార్గెట్ చేస్తాడు 20 లక్షల 80 వేల నగదు, కిలో 250 గ్రాముల వెండి వస్తువులు దొంగతనానికి పాల్పడిన నిందితుడు.
సికింద్రాబాద్ ప్యారడైజ్ సర్కిల్ వద్ద అనుమానస్పదంగా తిరుగుతున్న నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.
నిందితుడు నుండి 2,50,000 నగదు 250 గ్రాముల వెండి దొంగతనాన్ని వాడిన పలు వస్తువులతో పాటు ఒక ఆపిల్ ఫోన్, బజాజ్ పల్సర్ వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.
దొంగిలించిన వస్తువుల్లో ప్రియురాలికి వాటా ఉన్నట్లు పోలీసులు అనుమానం.
అతనిపై 13 పాత కేసులు ఉన్నట్లు డిసిపి వెల్లడించారు
ఇంకా మిగతాది రికవరీ చేస్తామని డిసిపి రక్షిత కృష్ణ
మూర్తి









