రేపు అనగా ఏప్రిల్ 14, 2026 మంగళవారం సందర్భంగా డా. బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా మనూర్ మండలంలోని రానాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు.
ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొననున్నారు. అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడంతో పాటు, ఆయన సేవలను స్మరించనున్నారు.
ఈ సందర్భంగా గ్రామపంచాయతీ అధికారులు గ్రామ ప్రజలందరినీ అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Post Views: 13









