*రైతుల కష్టాలు గాలికొదిలేసి.. గాలి మోటార్లలో ముఖ్యమంత్రి, మంత్రుల విహారాలు..*
*పండిన ప్రతి గింజనూ మద్దతు ధరకు కొనాల్సిందే.. సదాశివపేట కొనుగోలు కేంద్రంలో మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్.*
రిపోర్టర్: ఉల్లిగడ్డల శివకుమార్
, సంగారెడ్డి ప్రతినిధి
*కోటా సాకుతో శనగలు, మక్కలు, జొన్నల కొనుగోళ్లు నిలిపివేసి.. రైతులను నిలువునా ముంచుతున్నారు.*
*కొనుగోలు కేంద్రాలు లేక దళారుల పాలవుతున్న పంట.. శనగలపై ఎకరానికి 10 వేల నష్టం..*
*ఎన్నికల ముందు ఇచ్చిన బోనస్ హామీ పూర్తిగా బోగస్.. నేడు కనీస మద్దతు ధరకూ దిక్కులేదు..*
*వెంటనే కేంద్రాలు తెరిచి.. సన్నవడ్లకు గత యాసంగితో పాటు, ఈ యాసంగి బోనస్ కూడా చెల్లించాలి.*
……………………………………………..
మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సంగారెడ్డి నియోజకవర్గం, సదాశివపేట రైతు సేవా కేంద్రంలోని శనగల కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు లతో కలసి సందర్శించారు. కోటా అయిపోయిందంటూ కొనుగోళ్లు నిలిపివేయడంతో వారం రోజులుగా అక్కడే పడిగాపులు కాస్తున్న రైతుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎందుకు కొనుగోలు చేయడం లేదని అధికారులను నిలదీశారు.
*ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ…*
ఏటిగడ్డ సంఘం తదితర గ్రామాల రైతులు తమ శనగలు కొనడం లేదని మా దృష్టికి తీసుకురావడంతో, ఇక్కడి డీసీఎంఎస్ సెంటర్ కు రావడం జరిగింది. రైతులను, నిర్వాహకులను అడిగితే కోటా అయిపోయిందని చెబుతున్నారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రైతులకు విత్తనాలు, ఎరువులు ఇవ్వలేకపోతోంది.
సకాలంలో రైతుబంధు ఇవ్వకపోగా.. కనీసం పండిన పంటను మద్దతు ధరకు కొనే పరిస్థితిలో కూడా లేదు. ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేక ప్రభుత్వం.
ముఖ్యమంత్రి, మంత్రులు గల్లీకి తక్కువ.. ఢిల్లీకి ఎక్కువ అన్నట్లుగా తయారయ్యారు.









