జ్యోతిరావు పూలేకు స్వర్ణకార సంఘం ఘన నివాళి: కామినేని చౌరస్తాలో పూలమాలలు వేసిన వింజమూరి రాఘవాచారి

ఎల్.బి నగర్ నియోజకవర్గం, పరిధిలోని కామినేని చౌరస్తా వద్ద మహనీయుడు *జ్యోతిరావు పూలే* గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి *తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం* రాష్ట్ర అధ్యక్షులు *వింజమూరి రాఘవాచారి* తో కలిసి రాష్ట్ర కార్యదర్శి *రాగిఫణి సతీష్ కుమార్* పాల్గొని పూలమాలలు వేసి *ఘన నివాళులు* అర్పించారు.

ఈ సందర్భంగా *వింజమూరు రాఘవాచారి మాట్లాడుతూ. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, ముఖ్యంగా విద్యా విస్తరణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే గారని కొనియాడారు. సమాజంలో సమానత్వం, న్యాయం, విద్యా హక్కుల కోసం ఆయన చేసిన కృషి అమోఘమని తెలిపారు.

అణగారిన వర్గాలకు విద్య అందించడం ద్వారా సమాజాన్ని మార్పు దిశగా తీసుకెళ్లిన మహోన్నత సంస్కర్తగా ఆయన నిలిచారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను అనుసరించి సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి *సుంకోజు పోతులూరి ఆచారి, పోతకమురి రమేష్ చారి, కన్నకంటి రామాచారి,గిరిధరాచారి,* మరియు *లక్ష్మణా.* తదితరులు పాల్గొన్నారు..
*తేదీ:-11/04/2026.*

*తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం*

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు