( ) కీసర మండలంలోని ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం చిర్యాల లక్ష్మీనరసింహస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎండల దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యాలను కల్పించారు. “నగరం నడిబొడ్డున ప్రకృతి ఒడిలో కొలువై ఉన్న చిర్యాల క్షేత్రం భక్తుల పాలిట కొంగుబంగారంగా నిలుస్తోంది.స్వామివారిని దర్శించుకుని 41 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ వేడుకలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక మంత్రోచ్ఛారణలతో మారుమోగుతోంది. ప్రకృతి ఒడిలో కొలువై ఉన్న చిర్యాల క్షేత్రం భక్తుల పాలిట కొంగుబంగారంగా నిలుస్తోంది. ఈ బ్రహ్మోత్సవాల్లో..పంచామృత అభిషేకాలు, అంకురార్పణ, అత్యంత వైభవంగా స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవంతో పాటు చక్రస్నానం, పూర్ణాహుతితో ఉత్సవాలు ముగియనున్నాయి









