బండి సంజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం: జగదీష్ గౌడ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతల ఆగ్రహం

మల్కాజ్గిరి : భారతీయ జనతా పార్టీ నీ, పార్టీ నాయకులని, సనాతన హిందూ దర్మం పైన,బండి సంజయ్ గుంరించి అనుచితంగా అసభ్యంగా మాట్లాడిన బిఅర్ ఎస్ నాయకులు నిరుగొండ జగదీష్ గౌడ్ వెంటనే మాటలను వెనక్కి తీసుకోవాలని టిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా
ఉడుత నవీన్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ
ప్రపంచం లోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బిజెపి దేశంలో 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నపార్టీ దేశం కోసం,ధర్మం కోసం, సమాజం కోసం అహర్నిశలు పనిచేసే పార్టీ బిజెపి పార్టీ అటువంటి పార్టీని పార్టీ నాయకులను మర్యాదలేకుండా, మాట్లాడడం సమంజసం కాదు,అసలు మీది సరైన పార్టీ అయితే, మీనాయకులు మీరు సరైనోళ్లాయితే ప్రజలు మిమ్మల్ని ఎందుకు అధికారం నుంచి గద్దె దింపుతారని ప్రశ్నించారు. మా నాయకుడు బండి సంజయ్ గురించి మాట్లాడే అర్హత మీకు అస్సలే లేదు, మీ బాస్ నీ ఫామ్ హౌస్ కీ పరిమితం చేసిందే బండి సంజయ్ అన్నారు. డబ్బులు ఖర్చుపెట్టి నాలుగు పండుగలు చేసినంత మాత్రాన మీరు గొప్ప హిందువులు కారు
మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం అందరికి మంచిది అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మరో అధికార ప్రతినిధి రాందాస్ ధనరాజ్ , జిల్లా కోశాధికారి బాలచందర్ గౌడ్ , అసెంబ్లీ ఓబీసీ కన్వినర్ కిరణ్ ,వినాయక నగర్ డివిజన్ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ ,జిల్లా బీజేవైఎం అధికార ప్రతినిధి సృకేష్ గౌడ్ , ఆకారం సాయి , మహేష్ , తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు